తుమ్మలపల్లి బ్రిడ్జి పనులను అడ్డుకుంటే ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారు: ఎమ్మెల్సీ తాత మధు

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ​కొణిజర్ల, జూన్ 13: ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో పగిడేరు వాగుపై నిర్మాణంలో ఉన్న లో-లెవెల్ బ్రిడ్జి పనులను కాంగ్రెస్ నాయకులు అకారణంగా అడ్డుకోవడం దుర్మార్గమని ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాత మధుసూదన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఉదయం స్థానిక సర్పంచ్, మండల పార్టీ నాయకులు మరియు రైతులతో కలిసి ఆయన బ్రిడ్జి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ...