– రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 04.2026.
తుర్క కాషా ముస్లిం కమ్యూనిటీ అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు.సోమవారం వనపర్తి జిల్లా కొత్తకోటలోని ఏటీఆర్ కన్వెన్షన్ హాల్‌లో తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తుర్క కాశ ముస్లిం వర్గాలకు యాంత్రిక పనిముట్లను అందజేసే రాష్ట్ర స్థాయి పథకాన్ని మంత్రి అజరుద్దీన్ ముఖ్యఅతిథిగాహాజరైప్రారంభించారు.ఈసందర్భంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన 90 మంది తుర్క కాషా కమ్యూనిటీ లబ్ధిదారులకు రూ.54 లక్షల వ్యయంతో(ఒక్కో లబ్ధిదారునికి రూ.60 వేల విలువైన యూనిట్, 100శాతం సబ్సిడీతో) జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2025-26 సంవత్సరానికి 2,000 మంది లబ్ధిదారులకు రూ.12 కోట్లవ్యయంతోపనిముట్లనుమంజూరుచేశారు.మంత్రితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి, తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ తుర్క కాషా కమ్యూనిటీ సభ్యులు అత్యంతకష్టమైనవృత్తిలోజీవనోపాధిపొందుతున్నారని, ప్రభుత్వం అందిస్తున్న జనరేటర్లు, టూల్ కిట్లు వారి ఉపాధికిఎంతోఉపయోగపడతాయనిఅన్నారు. లబ్ధిదారులు వీటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. క్రికెట్ ఆడటం సులువు కానీ రాయి కొట్టే పని ఎంతో కష్టమైనదని తెలిపారు. కమ్యూనిటీ నుంచి వచ్చిన సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుందని, షాదీఖానాల నిర్మాణానికి కూడా అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో దేవరకద్రనియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇటీవల ముఖ్యమంత్రి కొత్తకోటలో ప్రభుత్వపాఠశాలప్రారంభించడంఇందుకునిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అహంభావాన్ని వీడి సమాజఅభివృద్ధికోసంకలిసిపనిచేయాలనిఆయనపిలుపునిచ్చారు.అనంతరదేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తుర్క కాషా కమ్యూనిటీ కోసం ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేకంగా ఈ పథకాన్ని అమలు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమాన్ని దేవరకద్ర నియోజకవర్గం నుంచి ప్రారంభించడం గర్వకారణమని తెలిపారు. ప్రజాపాలనలో అన్ని వర్గాలు, అన్ని రంగాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని, గతంలో తుర్క కాషా కమ్యూనిటీ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం వారి సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు. కమ్యూనిటీ అవసరాల దృష్ట్యా షాదీఖానాల నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని మంత్రిని కోరారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ కమ్యూనిటీ సంక్షేమంకోసంవిశేషంగాకృషిచేస్తున్నారనిఎమ్మెల్యేప్రశంసించారు.తదనంతరం తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఏర్పడిన ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందన్నారు. రాయి కొట్టే పనులు చేసే తుర్క కాషా కమ్యూనిటీ సభ్యులుగతంలోఎన్నోఇబ్బందులుఎదుర్కొన్నారని, వారి కష్టాలను గుర్తించిన ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి జనరేటర్, టూల్ కిట్ అందించే పథకానికిఆమోదంతెలిపిందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 2025-26 సంవత్సరానికి 2,000మందిలబ్ధిదారులకు రూ.12కోట్లవ్యయంతోఈపథకంఅమలుచేస్తున్నామనితెలిపారు.మైనార్టీలఉపాధికోసంఅనేకపథకాలుఅమలుచేస్తున్నామని, రాష్ట్రంలోని 50 లక్షల మంది మైనార్టీలకు అన్ని రకాల సంక్షేమ ప్రయోజనాలు అందించాలనిముఖ్యమంత్రిఆదేశించారనిచెప్పారు.శ్రమజీవులైన తుర్క కాషా సామాజిక వర్గానికి అవసరమైన పరికరాలను అందిస్తున్నామని, ఇంకా అర్హులైన వారు ఉంటే వారికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి కల్పిస్తామనిఆయన తెలిపారు.ఈకార్యక్రమంలో ఆర్డివో సుబ్రహ్మణ్యం, కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ పల్లవి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, తుర్క కాషా కమ్యూనిటీ అధ్యక్షుడు బడే సాబ్, టీజీఎంఎఫ్‌సీ ఏజీఎం ప్రవీణ్ కులకర్ణి, పవర్‌బిల్ట్ ఎగ్జిక్యూటివ్ కార్తీక్, సీడీసీ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కమ్యూనిటీ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
