తెలంగాణలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును ఆగస్టు 25, 2026 వరకు పొడిగించిన హైకోర్టు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ హైకోర్టు 03 ఆగస్టు 2026న జరిగిన విచారణలో ప్రస్తుతం అమల్లో ఉన్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఆగస్టు 25 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (TUWJF) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది...