తెలంగాణ రాజ్యాధికారం పార్టీ దేవరకద్ర ఇంచార్జ్ గా మంగరాయి వెంకటేష్
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 21 2026: మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మున్నూరు జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు బుధవారం రోజు హైదరాబాద్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న సమక్షంలో భారీగా చేరికలు మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శిగా ఆకుల చంద్రశేఖర్, టౌన్ మైనార్టీ అధ్యక్షులుగా నజీర్, దేవరకద్ర ఇంచార్జ్ గా మంగరాయి వెంకటేష్, దేవరకద్ర మండలం ఇన్చార్జిగా మన్యం, ప్రధాన కార్యదర్శిగా మల్లేష్,, టిఆర్పి పార్టీ అధినేత మల్లన్న నియామక పత్రంఅందజేశారు.
ఈ సందర్భంగా టిఆర్పి అధినేత తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ… ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు అన్ని వర్గాల పేద, బడుగు బలహీన ప్రజల బిడ్డలంతా ఒక్క జెండా కింద ఏకమవుతున్నారు. టిఆర్పి పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో తెలంగాణలో నిజమైన బీసీ రాజ్యం రావడం ఖాయం… సామాజిక న్యాయం కోసం, అన్ని వర్గాల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిసి జాతి బిడ్డల సంపూర్ణ మద్దతు ఉంటుంది. బీసీ రాజ్య నిర్మాణం కోసం మల్లన్న నాయకత్వానికి అండగా నిలబడతాం”….. సమాజంలో మార్పు అనే నినాదంతో ఈ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టిఆర్పి పార్టీ నాయకులు ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మదన్మోహన్ చారి, రాష్ట్ర కార్యదర్శి శివ వీరు, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మున్నూరు జైపాల్ రెడ్డి, వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు జి. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.