పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 22 2026: తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వేచ్ఛా స్పూర్తికి ప్రతీకగా నిలిచిన మహాకవి దాశరధి కృష్ణమాచార్యులు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. దాశరధి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా ఆయన సేవలను మననం చేసుకున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలాన్ని ఆయుధంగా మార్చి ప్రజల్లో చైతన్యం నింపిన విప్లవ కవిగా దాశరధిని కొనియాడారు. అగ్నిధార’, ‘రుద్రవీణ’, ‘తిమిరంతో సమరం’ వంటి రచనల ద్వారా తెలంగాణ ఆత్మను, స్వేచ్ఛా భావాలను ప్రజల్లో నింపారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సాహిత్యం నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని, ప్రతి ఒక్కరూ వాటిని ఆదర్శంగా తీసుకొని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ మహాకవి జయంతి సందర్భంగా ఆయన హృదయపూర్వక నివాళులు అర్పించారు.