తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వేచ్ఛా స్పూర్తికి ప్రతీక మహాకవి దాశరధి కృష్ణమాచార్యులు -ఎమ్మెల్యే మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 22 2026: తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వేచ్ఛా స్పూర్తికి ప్రతీకగా నిలిచిన మహాకవి దాశరధి కృష్ణమాచార్యులు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. దాశరధి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా ఆయన సేవలను మననం చేసుకున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలాన్ని ఆయుధంగా మార్చి ప్రజల్లో చైతన్యం నింపిన విప్లవ కవిగా దాశరధిని కొనియాడారు. అగ్నిధార',...