పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 02 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల మోజర్ల, గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల మోజర్లలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదులు వేసిన ఆచార్య జయశంకర్తో పాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థులకు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు విద్యార్థులు, ఉద్యోగులు అనేక కష్టనష్టాలను భరించి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు.
ముఖ్యంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు చేసిన త్యాగాలు తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నేటి విద్యార్థులు విద్య, క్రీడలు, సాంకేతికతతో పాటు అన్ని రంగాల్లో రాణించి ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి వారి సర్వతోముఖాభివృద్ధికి తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి. వెంకటస్వామి, గద్వాల కృష్ణయ్య, వాణి ప్రభ, కె. మధుసూదన్, ఎన్. వెంకటస్వామి, ఏ. వెంకటస్వామి, చిన్నారెడ్డి, విద్యార్థులు, విద్యార్థినులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.