POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 10:25 am Posted by : POLITICAL POWER

తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు

పెద్దమందడి పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం..

రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని విమర్శ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 05 2026: పెద్దమందడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారిని పోలీసుల ద్వారా అణచివేయాలని చూస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించేలా పోలీస్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. గురువారం రోజు తెల్లవారుజామున పెద్దమందడి మండల పోలీసులు పలువురు తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సతీష్ శర్మ, మాజీ మండల కోఆర్డినేటర్ ఖాజా హుస్సేన్, ప్రస్తుత బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వేణు యాదవ్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ముందస్తు అరెస్టులకు పాల్పడటం ఏమిటని స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులను ఇబ్బందులకు గురిచేయడం తగదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని, పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నాలు మానుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.