టియువి ఉద్యమ గర్జన పోస్టర్ ను విడుదల చేసిన టి యు వి చైర్మన్ నరాల సత్యనారాయణ, టియువి రిజిస్ట్రేషన్ నెంబర్ 74/ 2026
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 15 2026: తెలంగాణ ఉద్యమకారుల మహా గర్జన పోస్టర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమరవీరుల స్తూపం వద్ద మరియు చిల్డ్రన్ పార్క్ వద్ద విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా టి యు వి రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ మాట్లాడుతూ జూన్ 18 వ తారీఖున గురువారం రోజున హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జరిగే ఉద్యమ గర్జనను 33 జిల్లాల ఉద్యమకారులు విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో టి యు వి రాష్ట్ర అధ్యక్షులు శ్రావణ బోయిన నర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకెళ్లి సైమన్, రాష్ట్ర కమిటీ సభ్యులు గుడిక్యాల సమ్మయ్య, పిల్లి రాజయ్య, ఎండి సర్దార్ బేగ్, సయ్యద్ జావేద్, అలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.