POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 8:18 pm Posted by : POLITICAL POWER

తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాసాడి శ్రీరాములు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 13 2026: మాసాడి శ్రీరాములు ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ ప్రకటించారు. మాసాడి శ్రీరాములు తెలంగాణ ఉద్యమకారుల వేదికను ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ 10 ఉమ్మడి జిల్లాలలో ఉద్యమకారులు క్రమశిక్షణతో పని చేసే విధంగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మాసాడి శ్రీరాములు ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నియమించడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మాసాడి శ్రీరాములు ఉండడం వల్ల ఉద్యమకారులతో నిరంతరం మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమకారుల వేదిక ముందుకు సాగే విధంగా అడుగులు వేస్తారని ఒక నమ్మకంతో ప్రధాన బాధ్యతలు అప్పగించడం జరిగినదని టి యు వి చైర్మన్ నరాల సత్యనారాయణ తెలియజేశారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో క్రమశిక్షణ గల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు గా పేరున మాసాడి శ్రీరాములు ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ గా నియమించడం పట్ల తెలంగాణ 33 జిల్లాలలోని ఉద్యమకారులు వర్షాన్ని వ్యక్తం చేసినట్లుగా నరాల సత్యనారాయణ తెలియజేశారు