POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 8:52 pm Posted by : POLITICAL POWER

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కొడుకు కే టి రామారావు బంపర్ ఆఫర్

పొలిటికల్ పవర్ ప్రతినిధి తెలంగాణ

కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలపై స్పందించిన కేటీఆర్

మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం.. రేవంత్ రెడ్డి చెప్పిన రూ.లక్ష కోట్లు రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో వేస్తాడా?

తెలంగాణలోని పేద ప్రజల ఖాతాలో వెంటనే రేవంత్ రెడ్డి రూ.లక్ష కోట్లు వేస్తానంటే.. మా పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని రాసిస్తాం

లేకపోతే రేవంత్ రెడ్డి పిచ్చి ప్రచారాన్ని ఇకనైనా మానుకుని వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు

వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్ అంటూ రేవంత్ రెడ్డి ఇంతకాలం చేసిన విషప్రచారం బెడిసి కొట్టడంతో.. ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి రూ.లక్ష కోట్ల భూములు అంటూ ఈ విష ప్రచారం చేయడానికి సిగ్గనిపిస్తలేదా?

కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని రేవంత్ రెడ్డే అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకున్నాక కూడా కుతంత్రాలతో కట్టుకథలు అల్లుతున్నాడు

వెయ్యి రోజుల విఫల పాలన నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే ఈ కుట్ర చేస్తున్నట్టు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది

420 హామీల మోసాల నుంచి, 22-A భూకుంభకోణం నుంచి ఈ చిల్లర ఆరోపణలతో నాలుగు కోట్ల ప్రజల దృష్టిని మళ్లించలేరు

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలు, కుంభకోణాలన్నింటినీ బయటపెడతాం

రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకున్న ప్రతి పైసాను తెలంగాణ ప్రజల సాక్షిగా కక్కిస్తాం

* కేటీఆర్