POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 5:58 pm Posted by : POLITICAL POWER

తెలంగాణ రక్షణ సమితి (డెమొక్రటిక్) పార్టీ ఆధ్వర్యంలో రైతు సింహ గర్జన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జూన్ 27 2026: టీఆర్ఎస్ (డి ) పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ జూన్ 30వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రైతు సింహ గర్జనను నిర్వహిస్తున్నాం. రైతు సింహ గర్జన ముఖ్య ఉద్దేశం రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు రెండు లక్షల వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి. రైతు మోటార్ల పై అదనపు భారం వేయకూడదు. మక్కాను, వడ్లను కొనుగోలు చేయాలి. పసుపు రైతులకు న్యాయం చేయాలి. కౌలుదారులకు కౌలు భద్రతా చట్టాన్ని ఏర్పాటు చేయాలి. రైతు కూలీలకు 12 వేల రూపాయలు ఇవ్వాలి. రైతుబంధు ప్రతి ఎకరాకు 15000 ఇవ్వాలి. రైతులకు గ్రామీణ బ్యాంకుల ద్వారా, సహకార పరపతి సంఘాల ద్వారా వడ్డే లేని రుణాలు ఇవ్వాలి. ప్రభుత్వమే నాణ్యమైన వ్యవసాయ విత్తనాలు ఇవ్వాలి. ప్రభుత్వమే నాణ్యమైన రసాయనిక క్రిమిసంహారక మందులను ఇవ్వాలి. ప్రభుత్వము రైతులకు సరిపడా ప్రతి మండలంలో గిడ్డంగి సౌకర్యాలను కల్పించాలి. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేవరకు గిడ్డంగి సౌకర్యాలలో నిల్వ చేసుకునే ఉచిత సౌకర్యాన్ని కల్పించాలి. రైతులు అప్పుల బారిన పడకుండా ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారస్తులకు తప్పనిసరిగా లైసెన్సింగ్ ఉండే విధానాన్ని అతి తక్కువ వడ్డీకి ఇచ్చే విధానాన్ని ఏర్పాటు చేయాలి. రైతు కుటుంబాలలో పెండ్లిండ్లు శుభకార్యాలు తదితర కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రభుత్వమే వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించాలి, కౌలు రైతులను ఆదుకోవాలి, పోడుదారులకు పట్టా భూములు ఇవ్వాలని, తడిసిపోయిన రైతు పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ (డి)పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ డిమాండ్ చేస్తూ జోన్ 30వ తేదీన సింహ గర్జనను ఏర్పాటు చేయడం జరిగింది.