వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పరిశోధనాత్మక కథనం ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువ అలాగే అటవీ ప్రాంతానికి దగ్గరలో జీవించే అమాయక గ్రామీణ ప్రజలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువమంది ఉంటారు వారికి దగ్గరలో గవర్నమెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వాటిలో పనిచేసే వైద్య సిబ్బంది వారికి ఏదైనా అనారోగ్య పరిస్థితులు వస్తే దిక్కు ఇది సీజనల్ వ్యాధులు వచ్చే ఈ సమయంలో కూడా వాళ్లు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు దీని కారణం ఎవరు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువైంది కాబట్టే ఇలాంటి సంఘటనలు నిరంతరం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఎవరు కారణం ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు 20 రోజులు విదేశాల్లో ఉంటూ పది రోజులు లోకల్ లో ఉంటున్నారు ఆ పది రోజుల్లో ఆరు రోజులు మాత్రమే డ్యూటీలో ఉంటున్నారు దీని కారణం ఎవరు మీరు ఎవరెవరిని మేనేజ్ చేస్తున్నారు మరో విషయం ఏంటంటే ప్రభుత్వ అధికారులు కలెక్టర్లు గమనించవలసింది ఏమిటంటే వాళ్ళ పాస్పోర్టు ఎన్ని రోజులు ఈ దేశంలో ఉంటుంది ఎన్ని రోజులు వేరే దేశంలో ఉంటుంది అలాగే వాళ్ళ టూర్ రికార్డు మరియు వారు పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ రిజిస్టర్ మస్టర్ రోల్ అన్ని ఒకసారి తనిఖీ చేస్తే ఎవరెవరు ఏ రోజుల్లో ఎక్కడుంటున్నారు వారు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లు కొంతమంది ఇక్కడ నీట్ లో సీట్ రాని ఎంబిబిఎస్ చదవాలనుకునే పిల్లలు చదివించాలనుకునే తల్లిదండ్రుల కోరికలు ఆసరాగా చేసుకుని వారిని విదేశాల్లో చదివించడానికి ఒక రేటుకు మాట్లాడుకొని అక్కడికి వెళ్లి ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని అక్కడ యూనివర్సిటీలో జాయిన్ చేసి వస్తున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు వారు సొంతంగా క్లినిక్లు పెట్టుకొని వారికి నచ్చినప్పుడు వైద్యం చేస్తూ మిగతా టైం లో వేరే దేశాలల్ల ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ని తీసుకెళ్లి అక్కడ యూనివర్సిటీలో జాయిన్ చేసి వస్తే సరిపోతుంది అసలు భారతదేశంలో ఇలా జరగటానికి కారణం ఎవరు ప్రజల పాలకుల ఎవరు కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రభుత్వంలోనే కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. వారి పరివేక్షణ కూడా కొరబడింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యవేక్షణ కూడా కొరవడింది కాబట్టే ఇలా జరుగుతుంది ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకరు రెవెన్యూ శాఖ మంత్రి ఒకరు ఆర్థిక శాఖ మంత్రి ఒకరు వ్యవసాయ శాఖ మంత్రి ముగ్గురు కూడా రాజకీయ ఉద్దండులే వీళ్ళకి ఈ విషయాలు ఏం తెలియట్లేదా తెలిసిన తెలియనట్టు నిమ్మకు నేరెత్తినట్లు ఉంటున్నారా దీనివల్ల ఎవరికి నష్టం బడుగు బలహీన వర్గాలు అమాయక గ్రామాల ప్రజలే కదా నష్టపోయేది వారికి సంబంధం లేని విషయం కాబట్టి వారు పట్టించుకోవట్లేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది కొస మెరుపు ఏంటంటేఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు ఒక సంవత్సరంలోనే కోట్ల పోగేసుకుంటున్నారు వాళ్ళు తిరిగి కార్లే 40 లక్షలు 50 లక్షలు విలువ కలిగిన కార్లు వారి దగ్గర ఉన్నాయి వాళ్లకు ప్రభుత్వం ద్వారా వచ్చే జీతం ఎంత వారి మెయింటినెన్స్ ఎంత అనేది అర్థం కాని ప్రశ్న ఓ విషయం ఏంటంటే వారు ఎంబీబీఎస్ డాక్టర్ చదువు పూర్తి చేసి గవర్నమెంట్ డాక్టర్ గా చేరిన దగ్గర నుంచి ఇప్పటివరకు వారికి వచ్చిన జీతం ఎంత వారు పైన సంపాదించింది ఎంత అలాగే డాక్టర్ గా జాయిన్ అయినప్పుడు వారు కట్టిన ఐటీ అంతా ఇప్పుడు కడుతున్న ఇటి అంతా వారికి ఉన్న ఆస్తులు ఎంత అనేది ఒక లెక్క తీసి వారి ఆస్తులను జాతీయం చేయాలి ఎందుకంటే ఇది రాజ ద్రోహం కన్నా పెద్ద నేరం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలో పిల్లలను జాయిన్ చేసే కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న మరియు ప్రైవేటు యూనివర్సిటీలతో భాగస్వాములుగా ఉండి అక్కడ పిల్లల్ని జాయిన్ చేస్తూ కోట్ల రూపాయలు అర్జిస్తున్న ఈ గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లను ఉద్యోగంలో నుంచి రిమూవ్ చేసి కొత్త వారిని రిక్రూట్ చేసుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా అమాయక గ్రామీణ ప్రజలు కోరుకుంటున్నారు ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కండ్లు తెరిచి ఈ విషయాన్ని చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు కొస మెరుపు ఏంటంటే ప్రజలు చెబుతున్న విషయం ఏంటంటే వారు వేరే వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో ఉంటున్నప్పుడు వారి టూర్ డైరీ అలాగే వారు ఏ ప్రాంతంలో ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారో ఆ ప్రాంతంలో డ్యూటీ చేసే దగ్గర హాజరు పట్టిక మరియు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ బుక్కు ఎవరు తనిఖీ చేస్తారు వారి పాస్పోర్టు సంవత్సరంలో ఎన్ని రోజులు బయట దేశాల్లో ఉంటుంది ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుంది అనే విషయాన్ని పర్యవేక్షణ ఎవరు చేయాలి ఎవరు చేస్తే అమాయక ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది విదేశాలలో ఉండే యూనివర్సిటీలకు ప్రభుత్వ డాక్టర్లు ఏజెంట్లుగా పని చేస్తున్నారు దీంట్లో ప్రభుత్వ డాక్టర్లకు యూనివర్సిటీల్లో వాటాలు కూడా ఉన్నాయనేది విశ్వసినీయ సమాచారం దీనిపై సమగ్ర విచారణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుతుందా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జరుపుతుందా అనేది ప్రజలకు తెలియాల్సి ఉంది ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లుగా ఉద్యోగాలు నిర్వహిస్తూ ఇక్కడ అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో వారిఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా పిల్లలను ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఐదు ఆరువేల మందిని ప్రతి సంవత్సరం విదేశాల్లో ఉన్న వివిధ యూనివర్సిటీల్లో వీరు చేర్చుతున్నారు ఈ మొత్తం దందా అందరికి తెలిసే జరుగుతుంది.