POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 4:48 pm Posted by : POLITICAL POWER

తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం మద్నూర్ మండల కమిటీ ఏర్పాటు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక /పి ఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి బషీర్ అగస్టు 11 2026: తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ మార్గదర్శకత్వంలో, జిల్లా అధ్యక్షులు దుంపటి రాజు గారి ఆదేశాల మేరకు ,నియోజకవర్గ అధ్యక్షుల బొమ్మల నాగరాజు అద్వర్యం లో ఈరోజు మద్నూర్ మండల ఉప సర్పంచుల ఫోరం మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ వర్కింగ్ ప్రాసిడెంట్ చింతలా దుర్గ నరేష్,

జుక్కల్ నియోజకవర్గ ఉప అధ్యక్షులు పూజారి గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుల బొమ్మల నాగరాజు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఉప సర్పంచుల హక్కుల పరిరక్షణ, గౌరవం మరియు అధికారాల సాధనే ఫోరం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి మండలంలో బలమైన కమిటీలను ఏర్పాటు చేసి, ఉప సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం సమష్టిగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం మండల గౌరవ అధ్యక్షులు క్యాతమ్ వార్ మహేష్ మాట్లాడుతూ, ఉప సర్పంచుల చెక్ పవర్ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, గ్రామాల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై సర్పంచ్ లతో సహా ఉప సర్పంచుల పేర్లను తప్పనిసరిగా పొందుపరచాలని, ఉప సర్పంచుల కు గౌరవ వేతనo 5000 వార్డు మెంబర్ కి 3000 ఇవ్వాలని, ఉప సర్పంచులకు వైస్ చైర్మన్ హోదాతో పాటు సర్పంచ్‌తో సమానంగా సంతకం చేసే అధికారాన్ని కల్పించాలని, ప్రతి ప్రభుత్వ, మండల స్థాయి అధికారిక కార్యక్రమానికి ఉప సర్పంచులను కూడా గౌరవ అతిథులుగా ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. మండల కమిటీ సభ్యుల పేర్లు – గ్రామాల వారీగ – అధ్యక్షుడు –క్యాతం వార్ మహేష్ (రుసేగావ్) – ఉపాధ్యక్షుడు – ఎం డి ఫక్రు పటేల్ (షేఖపూర్), ఈ కార్యక్రమంలో మండలంలోని ఉప సర్పంచులు, , ఫోరం ఉప సర్పంచ్ లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.