POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 9:11 am Posted by : POLITICAL POWER

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూమంత్రి ఇలాకాలో మట్టి మాఫియా ఆగడాలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: దివారం అధికారులకు సెలవు… అక్రమార్కులకు పండుగ! ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోని రూరల్ మండలంలో వెంకటగిరిలో యథేచ్ఛగా మట్టి దోపిడీ – అధికారులు మౌనవ్రతం ఎందుకు? ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం అయినా, అక్రమ మట్టి మాఫియాకు మాత్రం అది స్వర్ణావకాశంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూరల్ మండల ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి గ్రామంలో బహిరంగంగానే భారీ ఎత్తున మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, దీని వెనక అధికార పార్టీ చెందిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ప్రధానా అనుచరుడు పాత్ర ఉందని ప్రజలు అంటున్నారు ఓ టీడీపీ నాయకుడు, మరో అధికార పార్టీకి చెందిన నేత సమక్షంలో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, జేసీబీల సహాయంతో వందలాది ట్రిప్పుల మట్టిని ఖమ్మం ప్రాంతానికి తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ప్రజా వనరులను దోచుకుని కొందరు తమ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఆదివారం కావడంతో సంబంధిత అధికారుల ఫోన్లు అందుబాటులో లేకపోవడం, ఫిర్యాదులకు స్పందన లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ అక్రమ తవ్వకాలపై అధికార యంత్రాంగం ఎందుకు కళ్లు మూసుకుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యమా? లేక అక్రమార్కులకు అండదండలా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న ఈ అక్రమ మట్టి తవ్వకాలపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారెవ్వరైనా చట్టం ముందు సమానమేనని నిరూపించేలా అధికారులు తక్షణమే రంగంలోకి దిగి విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.