తెలుగు రాష్ట్రాల్లో గాడి తప్పుతున్న గిరిజనాభివృద్ధి లక్ష్యం

పాలకుల ఉదాసీనతకు అద్దం పడుతున్న ఐటీడీఏల వైఫల్యం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ భారత రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన ప్రత్యేక హక్కులను, రక్షణలను క్షేత్రస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు రూపుదిద్దుకున్న వ్యవస్థలే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటిడిఎ). కానీ, నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులను పరిశీలిస్తే ఈ సంస్థలు తమ మూల సూత్రాలను, ప్రాథమిక దిశను కోల్పోయాయనే భావన స్పష్టమవుతోంది. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నెరవేర్చడంలో మరియు అత్యంత...