POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 6:03 pm Posted by : POLITICAL POWER

తోబుట్టువుగా అండగా ఉంటా నియోజకవర్గానికి పెద్దన్నగా పనిచేస్తా -ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

రాఖీ కట్టిన మహిళలకు ఆప్యాయతగా చీరలు బహుకరించిన ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 28 2026: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి నియోజకవర్గంలో ఆత్మీయత, అన్నాచెల్లెళ్ల అనుబంధం వెల్లివిరిసింది. నియోజకవర్గ పరిధిలోని మహిళలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డికి రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే మేఘారెడ్డికి రాఖీ కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు. రాఖీ కట్టిన ప్రతి మహిళను ఆయన ఆత్మీయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తనకు రాఖీ కట్టిన మహిళలందరికీ చీరలను బహూకరించి తన సోదర ప్రేమను, ఆప్యాయతను పంచుకున్నారు. రాఖీ అనేది కేవలం ఒక దారం కాదని, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, నమ్మకం, భరోసా, బాధ్యతలకు ప్రతీక అని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. మహిళలు తనకు రాఖీ కట్టి చూపించిన ఆత్మీయతను ఎప్పటికీ మరచిపోలేనని, వారి ప్రేమాభిమానాలను గౌరవంగా స్వీకరిస్తున్నానని తెలిపారు. “మీరు నన్ను అన్నగా భావించి రాఖీ కట్టారు.. ఇకపై నేను కూడా మిమ్మల్ని నా తోబుట్టువులుగా భావిస్తూ ఎల్లవేళలా మీకు అండగా ఉంటాను. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా సంకోచించకుండా నా దృష్టికి తీసుకురండి. మీ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను” అని ఎమ్మెల్యే మేఘారెడ్డి భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి మహిళకు తాను తోబుట్టువుగా, పెద్దన్నగా అండగా నిలుస్తానని ఆయన స్పష్టం చేశారు. మహిళల భద్రత, సంక్షేమం, గౌరవం, ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలతో కుటుంబసభ్యుడిగా మమేకమై, వారి సుఖదుఃఖాల్లో భాగస్వామిగా ఉండటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మహిళలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రతి ఇంటి పెద్దన్నగా, ప్రతి కుటుంబానికి అండగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ… ఎమ్మెల్యే మేఘారెడ్డి తమతో ఆప్యాయంగా మెలుగుతూ, తమ సమస్యలను సొంత కుటుంబ సభ్యుల సమస్యలుగా భావించి పరిష్కరించేందుకు ముందుండటం సంతోషంగా ఉందని తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే తమకు చీరలు బహూకరించడం మరింత ఆత్మీయతను కలిగించిందని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా సాగిన ఈ కార్యక్రమం వనపర్తి నియోజకవర్గంలో ఆత్మీయతను, అనుబంధాన్ని చాటిచెప్పింది.