దమ్మపేట కోర్టు సాధనలో విశేష కృషి చేసిన న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ కు ఘన సన్మానం
దమ్మపేట,పొలిటికల్ పవర్, ఆగస్టు 25: "ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండాలి… న్యాయస్థానం ప్రజల చెంతకు రావాలి” అనే సంకల్పంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో న్యాయస్థానం ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేసిన సత్తుపల్లి సీనియర్ న్యాయవాది, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందడపు రాజేంద్రప్రసాద్ ని దమ్మపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.దమ్మపేట ప్రాంత ప్రజలు తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం వెళ్లాల్సి రావడం, అశ్వారావుపేట నుంచి కొత్తగూడెం వరకు సుమారు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి రావడం వల్ల...