దమ్మపేట పోలీస్‌స్టేషన్‌లో పాల్వంచ ఎస్‌డీపీవో వార్షిక తనిఖీ

రికార్డులు, సీసీటీఎన్‌ఎస్‌, సైబర్‌ క్రైమ్‌ పనితీరుపై సమీక్ష పొలిటికల్ పవర్, ఆగస్టు 26,దమ్మపేట: దమ్మపేట పోలీస్‌స్టేషన్‌ను పాల్వంచ ఎస్‌డీపీవో బుధవారం వార్షికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బంది హాజరు, కిట్‌ సామాగ్రి, స్టేషన్‌ పరిసరాలు, నేరాలకు సంబంధించిన వాహనాలు, వివిధ రికార్డులను పరిశీలించారు. అలాగే CCTNS, సైబర్‌ క్రైమ్‌ విభాగాల పనితీరును సమీక్షించారు. ఆన్‌లైన్‌లో ఎలాంటి పనులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజలకు మెరుగైన పోలీస్‌ సేవలు అందించాలని...