దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో దళారులకు చోటు లేదు
రైతులు, భూ హక్కుదారులు అప్రమత్తంగా ఉండాలి.. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: తహసీల్దార్ పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 22: దమ్మపేట మండల రెవెన్యూ కార్యాలయంలో దళారీ వ్యవస్థకు ఎలాంటి అవకాశం లేదని, రైతులు, భూ హక్కుదారులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని డిప్యూటీ కలెక్టర్ (ట్రైనీ), దమ్మపేట తహసీల్దార్ మద్దినేని మురళి సూచించారు. రెవెన్యూ కార్యాలయంలో దళారుల కార్యకలాపాలు తిరిగి కొనసాగుతున్నాయంటూ వస్తున్న ప్రచారంపై స్పందించిన ఆయన.. భూ వ్యవహారాలకు సంబంధించి రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కొందరు వ్యక్తులు ప్రస్తుత తహసీల్దార్...