POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 11:54 am Posted by : POLITICAL POWER

దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో శనివారం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామ ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నామన్నారు.రసాయనాలతో తయారు చేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP) విగ్రహాల వల్ల చెరువులు, కుంటలు కలుషితం అవుతున్నాయని, అందుకే ప్రజలంతా మట్టి వినాయకులనే పూజించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆమె తెలిపారు. మట్టి విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగదని, పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.