దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో శనివారం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామ ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నామన్నారు.రసాయనాలతో తయారు చేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP) విగ్రహాల వల్ల చెరువులు, కుంటలు కలుషితం...