POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 7:46 pm Posted by : POLITICAL POWER

దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో ముగిసిన ఆఫ్ క్యాంపస్ ప్రాంగణ నియామకాలు.

స్టేట్ బ్యూరో : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు:

ఖమ్మం రూరల్:   పాలేరు నియోజకవర్గం : స్థానిక ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ సత్యనారాయణపురం కొత్తూరు గ్రామ శివారులో గల దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు అనగా 29/08/2026 ఉదయం 10:00 గంటల నుంచి 04:00 గంటల వరకు దరిపల్లి అనంతరాములు ఆడిటోరియం నందు ప్రముఖ ఎస్.ఎల్.బి ఏజెన్సీస్ వారి సౌజన్యంతో వివిధ కంపెనీల కొరకు నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అర్హత, ప్రతిభ కలిగిన 11 మందిని ఎంపిక చేసి వారిని తదుపరి ఇంటర్వ్యూలకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులకు సెప్టెంబర్ 2,3 తారీఖులలో ఉదయం 10:00 గంటలకు తదుపరి మరియు ఫైనల్ ఇంటర్వ్యూలు కలవు.                                                                              ఈ ఆఫ్ క్యాంపస్ ప్రాంగణ నియామకాలకు ఖమ్మం తో పాటు చుట్టుపక్కల ఉన్న భద్రాచలం, ఇల్లందు, మహబాద్, వరంగల్, సూర్యాపేట, మిర్యాలగూడ, యాదాద్రి భువనగిరి మరియు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు.                                 ఈ ప్రాంగణ నియామకాలకి ఎస్.ఎల్.బి ఏజెన్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటిఐ 2 సం||లు పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులకు ఏం టి ఎ ఆర్ కంపెనీ ద్వారా కంపెనీ నందు నెలకు ₹19,000/- తో జాబ్ మరియు కంపెనీ వారు జాబ్ తో పాటు కంపెనీ లోనే డిప్లొమా చదువుకొనే అవకాశాలను కల్పించటం, తద్వారా ఉన్నత విద్య కి వెళ్లే చక్కని మార్గాన్ని ఈ కంపెనీ వారు కల్పించటం, జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరి అదృష్టంగా భావించాలని కోరారు.                                        ఈ కార్యక్రమంలో డాక్టర్ దరిపల్లి కిరణ్ ప్రిన్సిపాల్ మరియు ప్లేస్మెంట్ ఆఫీసర్ మాట్లాడుతూ కళాశాలలో ప్లేస్మెంట్ ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ప్లేస్మ్ంటే లక్ష్యంగా, మా దగ్గరకి వచ్చిన ప్రతి విద్యార్థిని విద్యార్థులను కంపెనీ లకు పంపించే విధంగా మా కళాశాల “దరిపల్లి ప్లేస్మెంట్ వింగ్” పనిచేస్తుందని తెలిపారు.         ఏజెన్సీ వారు 30/08/2026 రోజున కూడా అందుబాటులో కళాశాల నందు ఉదయం 10:00 గంటలకు అందుబాటులో ఉంటారని ఐటిఐ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.                                ఈ కార్యక్రమంలో దరిపల్లి విద్యాసంస్థల అధినేత మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ దరిపల్లి కిరణ్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వెంకట్, కరస్పాండెంట్ దరిపల్లి స్వాతి, ఎన్సిసి కోఆర్డినేటర్ వెంకట్, డిప్లొమా అకడమిక్ ఇంచార్జ్ ఉమారాణి, బిటెక్ అకాడమిక్ ఇంచార్జీ నీలిమ, వివిధ విభాగాల అధిపతులు వెంకట్రావు, పుల్లయ్య, రామ్ కుమార్, టీచింగ్ స్టాఫ్ రవళిక, విజయ భవాని, చంద్రకళ, ప్రియ, రమేష్, శ్రీను, రమ్యశ్రీ, కళాశాల సిబ్బంది ప్రవీణ్, ప్రసన్నలక్ష్మి, రెహమతి మరియు విద్యార్థిని విద్యార్థులు సెలెక్ట్ ఐన విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.