POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 8:48 am Posted by : POLITICAL POWER

దళితుల అంటే దాడి చేసే వాళ్ళు కాదు

పొలిటికల్ పవర్ ప్రతినిధి  తెలంగాణ

వాళ్లు కాంగ్రెస్ పార్టీ తొత్తులు, కట్టు బానిసలు అసలు కాదు

ఆంధ్రాలో కులాల సంస్కృతి తెలంగాణలో తెచ్చేందుకు విఫలయత్నాలు చేస్తున్న రేవంత్ రెడ్డి

దళిత కార్డుతో బీఆర్ఎస్ మీద దాడికి పదే పదే ప్రయత్నాలు

మాదరి భాగ్యరెడ్డి వర్మ 1888 నుండి 1939 వరకు తెలంగాణ దళిత ఉద్యమ పితామహుడిగా పేరొందిన వ్యక్తి

ఆదిహిందూ ఉద్యమం మొదలు పెట్టి ఆత్మగౌరవం రగిలించిన మహనీయుడు

1931లో నిజాం ప్రభుత్వంలోనే దళితులను ఆది-హిందువులుగా నమోదు చేసేలా కృషి చేసిన నేత

అరిగె రామస్వామి (1885-1973)

భాగ్యరెడ్డి వర్మ సమకాలికుడు, సామాజిక సంస్కర్త.

ఆది-హిందూ జాతి ఉన్నతి సభ, సునీతా బాల సమాజం వంటి సంస్థలు స్థాపించి మహిళా విద్య, సామాజిక చైతన్యం కోసం పనిచేశారు

మాదిగ ఉపకులాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టి అరుంధతీయ మహాసభ స్థాపించారు.

వెట్టిచాకిరి, అంటరానితనం నిర్మూలన కోసం జిల్లాల్లో పర్యటించిన శక్తి

బీఎస్ వెంకట్రావు (1896-1953)

అంబేద్కర్ అనుచరుడు, రాజకీయ నాయకుడు.

ఆది-మాదిగ సంఘం స్థాపించి దళిత యువతలో చైతన్యం తెచ్చిన వ్యక్తి

నిజాం కాలంలో మున్సిపల్ కార్పొరేషన్, రాజ్యాంగ మండలికి ఎన్నికయిన వ్యక్తి

1952లో రాజ్యసభకు ఎన్నికై దళితులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన వ్యక్తి

టి.ఎన్. సదాలక్ష్మి

తెలంగాణ నుంచి మొదటి దళిత మహిళా శాసన సభ్యురాలు, మంత్రి

దళితులంటే కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలు కాదు

ఏడున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మోసపోయిన వాళ్లు

స్వతంత్ర భారతదేశ చరిత్రలో 38,600ల కుటుంబాలకు దళితబంధు కింద రూ.10 లక్షల చొప్పున ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేలా సాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్

నాడు కేసీఆర్ పాలనలో రాజకీయాలకు అతీతంగా దళితుల సంక్షేమం, అభివృద్ధి

నేడు కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం దళితుల వాడకం