దళితుల భూమిలో దౌర్జన్యంగా వేసిన పైప్‌లైన్ తొలగించాలి: ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ డిమాండ్
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో, జూన్ 19, 2026: వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు రాజనగరంలో దళితుల వ్యవసాయ భూమిలో వారి అనుమతి లేకుండా పైప్‌లైన్ ఏర్పాటు చేసిన ఘటనను వనపర్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. రాజనగరం ప్రాంతానికి చెందిన దళిత రైతుల సర్వే నంబర్ 65/ఆ లో, బీసీ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా...