POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 10:23 pm Posted by : POLITICAL POWER

దళిత భూములను భూకబ్జా చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలి.

 కాశినాయన సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ పి యన్ 9టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం ప్రసాద్ రావు కలసపాడు. వైయస్సార్ జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కాశి నాయన మండల పరిధిలోని నాయన పల్లె రెవెన్యూ పొలం సర్వేనెంబర్ 129 130 131 217 వందలు ఎకరాలు ప్రభుత్వ భూములు పేదలు దళితులు సాగుచేసిన భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకుని దళితుల పై దాడి చేసిన వైసిపి నాయకులు సత్యనారాయణ రెడ్డి ఆలయాస్ (నల్ల సత్యం) వారి కుమారుడు గోవింద్ రెడ్డి వెంటనే అరెస్టు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సగిలి గురవయ్య మండల అధ్యక్ష కార్యదర్శిలు లాజరస్ యర్జా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బుధవారం ఉదయం కలసపాడు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సగిలి గురవయ్య మండల అధ్యక్ష కార్యదర్శిలు లాజరస్ యర్జా మాట్లాడుతూ నాయన పల్లె రెవెన్యూ పొలంలో 2018 నుంచి వరికుంట్ల నాయన పల్లె గ్రామాల పేదలు దళితులు సాగు చేస్తున్న భూములను దౌర్జన్యంగా అగ్రవర్ణాలు భూకబ్జాదారులు వైసిపి ప్రభుత్వం లో రెవెన్యూ అధికారులను ప్రలోభాలు గురిచేసి వందల ఎకరాలు వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారు.

గత ఐదు రోజుల నుంచి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వరికుంట్ల నాయన పల్లె భూముల మీదికి పోతే దళితులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. వెంటనే అగ్రవర్ణాలను భూకబ్జాదాలను అరెస్టు చేయాలని, అదేవిధంగా భూ అక్రమ దార్ల కింద పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.