ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు సోయం వీరభద్రం
పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 21: దమ్మపేట అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 మంది గర్భిణులకు సామూహిక సీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ.. ప్రతి మహిళ జీవితంలో మాతృత్వం ఒక అపురూపమైన, మరపురాని అనుభూతి అని అన్నారు. గర్భిణులు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యుల సూచనల మేరకు పోషకాహారం తీసుకుంటూ, అవసరమైన వ్యాయామం చేయాలని సూచించారు. గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించడం ద్వారా వారిలో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దమ్మపేట మండలంలోని గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించడం అభినందనీయమని సోయం వీరభద్రం అన్నారు. ఇటువంటి సామాజిక, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
లింగాలపల్లిలో ఘన సన్మానం
అనంతరం దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామానికి చేరుకున్న సోయం వీరభద్రం గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ యువత, యువకులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ విద్యతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో ముందుండే లింగాలపల్లి యువతను అభినందించారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ గ్రామ అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమాల్లో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్, చిన్న అరుణాచల శివాలయ వ్యవస్థాపకులు గురూజీ శివనాగరాజు స్వామి, అరుణానంద స్వామి, అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ పసుమర్తి రామభద్రరావు, దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి-రాంబాబు, వైద్యురాలు మౌనిక, దమ్మపేట మండల మాజీ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా ఇన్‌చార్జి గిద్దా కొండయ్య, చెపా నాగు, తాటి రవికుమార్, సరియం విజయ్‌కుమార్, మోడియం శ్రీను, అశ్వారావుపేట నియోజకవర్గ యువ రాజకీయ నాయకులు వాడే వీరస్వామి, లింగాలపల్లి గ్రామ యువత, యువకులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Available next action: Create a downloadable DOCX file here in this chat containing the editable prose above