పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ 5న ఖమ్మంలో నేషనల్ కాన్ఫరెన్స్ విహెచ్‌పిఎస్ జాతీయ కోర్ కమిటీ ఛైర్మన్ గోపాల్‌రావు ఖమ్మం, సెప్టెంబర్ 1 2026: దివ్యాంగులకు ఆరు వేల రూపాయల ఫించన్ ఇవ్వాలని, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని విహెచ్‌పిఎస్ జాతీయ కోర్ కమిటీ ఛైర్మన్ ఎల్.గోపాల్‌రావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 5న ఖమ్మంలో నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న కొత్త పెన్షన్ దారులందరికీ దరఖాస్తు చేసుకున్న తేదీ నుండి మంజూరు చేయాలన్నారు. ఎన్నికల హామీ మేరకు స్థానిక సంస్థలలో దివ్యాంగులకు వెంటనే రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలలో నాలుగు శాతం ఉద్యోగాల భర్తీ చేయాలన్నారు. వికలాంగుల రోస్టర్లు పది లోపు సవరించాలన్నారు. ఎస్‌ఆర్‌డి జిఓను తక్షణమే ఇవ్వాలన్నారు. డ్రెస్ కోడ్ ఉద్యోగాలలో 4 శాతం రిజర్వేషన్ల కల్పించాలన్నారు. దివ్యాంగుల శాఖ స్వతంత్రత జిఓ అమలు చేస్తూ అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి సిబ్బందిని నియుమించాలన్నారు. సహకార సంస్థను బలోపేతం చేస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. సంస్థకు ఉన్న ఆస్తులను దివ్యాంగుల సంక్షేమ అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. 50 లక్షల విలుైవెన ఆరోగ్య భద్రత బీమా కార్డు ఇవ్వాలన్నారు. దివ్యాంగుల డిమాండ్లను పరిశీలించి పరిష్కరించాలని, లేకుంటే విహెచ్‌పిఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. 5న జరిగే కాన్ఫరెన్స్‌ను జయుప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కోర్ కమిటీ వైస్ ఛైర్మన్ అందె రాంబాబు, విహెచ్‌పిఎస్ జాతీయ అధ్యక్షులు సుజాత సూర్యవంశీ, రాష్ట్ర అధ్యక్షులు కాళ్ల జంగయ్య, జాతీయ మహిళా అధ్యక్షురాలు సామినేని భవానీ చౌదరి, విహెచ్‌పిఎస్ జిల్లా అధ్యక్షులు బొజ్జా జీవరత్నం, ఎంఎస్‌పి మాజీ అధ్యక్షులు అంజి మాదిగ, ఎంఆర్ పిస్ జిల్లా ఇన్‌ఛార్జి విజయ్ మాదిగ, విహెచ్‌పిఎస్ నాయుకులు భారతి, పుల్లమ్మ, సీతారాములు, సాయి, ఎంఆర్‌పిస్ నాయుకులు రాము మాదిగ, భాకీ శ్రీను మాదిగ, గాజుల నర్సింగరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.