POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 8:56 pm Posted by : POLITICAL POWER

దివ్యాంగుల కళ్ళలో ఆనందం నింపిన నిజమైన హీరోలు విద్యార్థులు – పలుస శంకర్ గౌడ్ గద్దె భాస్కర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 2026: వనపర్తి జిల్లా కేంద్రంలోని రేడియంట్ హైస్కూల్, తిరుమల హిల్స్ విద్యార్థులు దివ్యాంగుల కోసం విరాళాలు సేకరించి మానవత్వాన్ని చాటుకున్నారని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పరవస్తు సొసైటీ స్టేట్ కో ఆర్డినేటర్ గద్దె భాస్కర్ అన్నారు. శుక్రవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిలుగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు తమ పాకెట్ మనీ, ఇంటింటికి తిరిగి సేకరించిన ఆర్థిక సహాయాన్ని దివ్యాంగులకు అందించడం నిజంగా అభినందనీయమని అన్నారు.ఆర్థికసహాయాన్ని చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు పతకాలు అందచేసారు.విద్యార్థులు మొత్తం 16000 రూపాయలు కలెక్షన్ చేసారు. సమాజ సేవకు ముందుకొచ్చిన విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. పుస్తకాలకే పరిమితం కాకుండా మానవత్వాన్ని చూపిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మానవ సేవే మాధవ సేవ అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కౌసల్య భాస్కర్, ప్రిన్సిపాల్ ఉప్పరి తిరుమలేష్, వైస్ ప్రిన్సిపాల్ బి.రాము, ఎకో క్లబ్ కన్వీనర్ శృతి, ఉపాధ్యాయులు రాహుల్, శాంతయ్య, శ్రీనివాస్, అఖిల్, పి ఈ టీ వెంకటేష్, మల్లేష్, ఖదిరున్నిసా, రామేశ్వరి, గీతా, రజిత, శ్వేత, సరోజ, సాత్విక, జరీనా, తల్లిదండ్రులు, విద్యార్థులు, సాహితీ కళా వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.