దీపావళి వెలుగులు కావాలి.. కాలుష్యపు మంటలు వద్దు! భూమి వేడెక్కుతోంది.. వర్షాలు తగ్గుతున్నాయి.. ప్రకృతి విలవిలలాడుతోంది! ఇప్పటికైనా టపాకాయలకు స్వస్తి చెప్పండి.. పర్యావరణాన్ని కాపాడండి! వ్యాసకర్త: బస్కి నాయక్ బానోత్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి : దీపావళి అంటే దీపాల పండుగ. చీకటిని తొలగించి వెలుగులు నింపే పండుగ. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే పండుగ. కానీ నేటి రోజుల్లో దీపావళి అంటే దీపాల వెలుగుల కంటే టపాకాయల శబ్దాలు, బాంబుల పేలుళ్లు, పొగతో నిండిన వాతావరణం ఎక్కువగా కనిపిస్తోంది. అసలు మనం పండుగను జరుపుకుంటున్నామా? లేక మనం జీవిస్తున్న ప్రకృతినే మన చేతులతో నాశనం చేసుకుంటున్నామా? ఒకవైపు భూమి రోజురోజుకూ...