*దీపావళి వేడుకల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్* *టపాసుల దుకాణాల కేటాయింపులో పారదర్శకత పాటించాలి* *టపాసుల దుకాణాలలో భద్రతా ప్రమాణాల్లో రాజీ పడొద్దు* *ప్రతి దుకాణంలో విద్యుత్ వైరింగ్ తనిఖీ చేసి ధృవీకరించాలి* *దుకాణాల మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండాలి* *అగ్నిమాపక వాహనాలు, 108 సేవలు, అత్యవసర వైద్య చికిత్సలు అందుబాటులో ఉంచాలి* *దీపావళి వేడుకలపై సంబంధిత అధికారులు, విక్రయదారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్*

:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ఖమ్మం జిల్లా దీపావళి వేడుకల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.*మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి దీపావళి పండుగ వేడుకలు, టపాసుల విక్రయ దుకాణాల...