POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 8:45 pm Posted by : POLITICAL POWER

దీపావళి సందర్భంగా మోజర్లలో ఘనంగా వాలీబాల్ పోటీలు

 

విజేతలకు బహుమతులు అందజేసిన గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 08 2026: పెద్దమందడి దీపావళి పండుగను పురస్కరించుకొని పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో వాలీబాల్ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పోటీల్లో మొదటి, ద్వితీయ స్థానాలు సాధించిన జట్లకు గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తి, ఐక్యత, ఆరోగ్యకరమైన పోటీతత్వం పెంపొందుతాయని అన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, గ్రామ ప్రజలు, యువకులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.