POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 9:16 pm Posted by : POLITICAL POWER

*దుగ్గిరాల ఎన్నికల్లో భారీ రిగ్గింగ్..*  *7 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలి వైఎస్ఆర్సీపీ డిమాండ్*..

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

గుంటూరు దుగ్గిరాల మండలంలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తీవ్రమైన అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు.

ఉదయం నుంచే దుగ్గిరాల గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు అభ్యంతరాలు తెలియజేస్తూనే ఉన్నారని గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి కాశినేడి బాజీ గంగాధర్ రావు తెలిపారు.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని బాజీ గంగాధర్ రావు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారని, టీడీపీకి సహకరిస్తూ మంగళగిరి, తాడేపల్లి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని అనుమతించి రిగ్గింగ్ చేసే విధంగా ప్రవర్తించారని చెప్పారు.

తుమ్మపూడిలో 2 పోలింగ్ స్టేషన్లు,మంచికలపూడిలో 2 పోలింగ్ స్టేషన్లు,పేరకపూడి గ్రామంలో 3 పోలింగ్ స్టేషన్లు

ఆ 7 కేంద్రాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి, రిగ్గింగ్ జరిగినట్లు నిర్ధారణ అయినందున వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ తరపున డిమాండ్ చేశారు.

దీనికి సంబంధించిన ఫిర్యాదును అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అయిన తహసీల్దార్ సునీత గారికి అందజేసి వెంటనే పరిశీలించి రీపోలింగ్ చేయించవలసిందిగా కోరారు.

దుగ్గిరాల మండల జెడ్పీటీసీ అభ్యర్థి తాడిబోయిన శివగోపయ్య మాట్లాడుతూ తాను వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు.

పోలింగ్ సమయంలో తిరుగుతుండగా మంచికలపూడి, పేరుకలపూడి, తుమ్మపూడి గ్రామాల్లో రిగ్గింగ్ జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని, తాను స్వయంగా చూశానని చెప్పారు. ఎంపీటీసీ అభ్యర్థులు, ఏజెంట్లు కూడా తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తుమ్మపూడి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మేడికొండ విజయరావు, మంచికలపూడి ఎంపీటీసీ అభ్యర్థిని కుక్కమళ్ళ ఏసు మరియమ్మ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.