POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 2:55 pm Posted by : POLITICAL POWER

దురదపాడు  విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్న మాజీ జడ్పీటీసీ పైడి

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:దమ్మపేట మండల పరిధిలోని దురదపాడు గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాల్లో మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులు ఆయనకు చిరు సత్కారం చేశారు.

ఈ సందర్భంగా పైడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, “ఆ దేవదేవుడైన వినాయకుని దయతో మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాసాని నాగప్రసాద్, దురదపాడు గ్రామస్తులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.