POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 7:37 pm Posted by : POLITICAL POWER

దులే దులే దుఃఖంభాశాలే అంభా భీంభీం పతుంభ లల్లా

–  నిజంగా ఆరోజుల్లో చిన్నపిల్లలు పీర్ల పండగ ఎప్పుడోస్తుందాని ఎదురుచూసే టోళ్లు, 
– మహిళలు మసీదు దగ్గర ఆసేసి పూసేసి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్లుల్లే ఆశన్న ఊశన్నాల్లారాని బొడ్డేమ్మేలు కొట్టేవాళ్ళు,
– ఊర్లల్ల ఆశన్న, ఊశన్న, భారీ మొగుల్లలు, లాల్లు సావ్, పేరుమీద సవార్లు పెట్టేటోళ్లు,
–  పీర్ల పండుగ ఒక మరుపురాని సంబురం, కులాలేవీ, మతాలేవీ తెలియని సమయంలో, కల్మషం లేకుండా అందరూ కలిసి కట్టుగా జరుపుకునే వాళ్ళు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 26.2026.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మోహరం పండుగ అంటే కోయిలకొండ భీమ్ పాతుంమ్మ , ఊట్కూర్ మండలాలలో పెద్ద ఎత్తున జరుపుకునేవారు. జిల్లాల విభజనలో భాగంగా వనపర్తి జిల్లాలో పాన్గల్ మండలం, కొత్తకోట మండలంలోని రాయిన్ పేట, రామకృష్ణాపురం, పామాపురం గ్రామాలలో కందూర్లు చేస్తూ పెద్ద ఎత్తున పీర్ల పండుగను జరుపుకునేవారు. మిగతా గ్రామాలలో పీర్ల పండుగఒకమరుపురానిసంబురం, కులాలేవీ,మతాలేవీతెలియనిసమయంలో,కల్మషం లేకుండా అందరూకలిసికట్టుగాజరుపుకునేవాళ్ళు. నిజంగా ఆరోజుల్లో చిన్నపిల్లలు పీర్ల పండగ ఎప్పుడోస్తుందాని ఎదురుచూసే టోళ్లు, ఆ రోజుల్లో పీర్ల పండుగ అంటే అమావాస్య మల్తటి రోజు
చంద్రవంకను చూసి గుంత పెట్టె దింపేది. మరుసటి రోజుమసీదులోఆశన్న,ఊశన్న,భారీమొగుల్లలు,లాల్లు సావ్, మొగులాలుసావ్ పేర్ల మీద సవార్లు పెట్టేటోళ్లు, మహిళలు మసీదు దగ్గర ఆసేసి పూసేసి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్లుల్లే ఆశన్న ఊతన్నాల్లారాని, భీమమ్మ పుట్టినప్పుడు భూమి పుట్టిందే అమ్మ బీమ్ బీమ్ పతుమలల్లాఅని బొడ్డేమ్మేలు కొట్టేవాళ్ళు, తెలిసిందల్లా ఒక్కటే కులం లేదు, మతం లేదు అందూ కలసి అలాయి గుంత దగ్గర అలాదులా, అసాయ్ దులా అని పాడుకుంటూ ఆడటమే తెలుసు. అదే గొప్ప అనుభూతి. ఐదు రోజులకు రెండు పేర్లు బయలుదేరేవి గ్రామాన్ని మొత్తం చుట్టేసి పీర్ల మసీదు దగ్గర నిల్చునేవి. పెద్ద సర్గేస్స రోజు పిల్లలు పెద్దలు అందరూ కలిసి అస్సాం దుల్ల అంటూ అలాయి చుట్టూ దుంకేవారు. మహిళలు పెద్ద ఎత్తున మసీద్ దగ్గరకు చేరుకొని బొడ్డెమ్మ లు కోలాటలువేసేవారు.మరుసటిరోజుతెల్లవారుజామున పిర్లను లేపితే పిర్లు అలాయి చుట్టు తిరిగి గ్రామదేవతల దగ్గర కు వెళ్లి దర్శించుకుని గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి పూజలందుకునేవి. పీర్లకు జనం పిల్లలు లేనోళ్లకు సంతానమైతుందని అడిగేవాళ్లు, అప్పుడు సవార్ణ గ్రామం మంత తిరిగి మసీదులో గొండ్లోలకు ఉండేది. పీర్లకు పూజలు చేసేది మాత్రం తురక సాయబులు మాత్రమే పూజారులు. పిర్ల పేరుమీద పిల్లలకు ఆశన్నా, ఉశన్నా, ఆశ్మూ. ఊశ్కూ అని పేర్లు పెట్టుకునే వారు. పది రోజుల పాట జరిగే పీర్ల ఉత్సవాలల్ల హైలైట్ ‘అలావ్ ఆట’. గుంత తీసి ఆ గుంతలో మంటపెట్టేవాళ్లు,మంటమండేదిమండుతుండంగనే ఈ కొననుంచి ఆ కొనకు దుంకాలె. ఏ మాత్రం రాంగ్,స్టెవ్పేశినాగుంతలపడతారు.అట్లాదుంకుతుంటే అలా దులా అని కొందరు అంటారు. దానికి కొనసాగింపుగా అస్సోన్ దూల అనికొందరంటారు. అట్లా దుంకుతూ అడుతుంటేమస్తుమజావచ్చేదని అంటున్నారు. కొందరు మలిజ, మరికొందరు కందూర్లు చేసుకుని మొక్కులు చెల్లించుకునేవారు. మలీద ముద్దల కోసమే చిన్నపిల్లలు పడిగాపులు కాసేటోలు, మసీదు దగ్గర జూలూస్ అయిపోంగనే అతమాత్రం బావిలో నిమజ్జనం చేస్తందుకు
పెట్టేది. ఇక బానికి కొంత దగ్గర్లో దుకాల్లు ఉండేది. అప్పట్లో అటాణకో తీసుకపోయేది. గంటలకొద్దీ ఓపికతో అడి అదేందోగానీ ఉరికినట్టే పీర్లను ఎత్తుకొని పోతుంటే వాళ్లెనకాల పోరగాళ్లమంతా పరుగులు చారాలతో ఏదైనా కొనుక్కొని నిమజ్జనం అయి పోయినంక పెట్టే మలీద ముద్దలు తీసుకొని ఇంటికొచ్చేది. అంతా అయిపోయినంక కాసీము నిలిచేది వెండి మాసీ బంగారి మాసీడో అతియ సక్కని వాడే మన కాసిములయ్యా అని పాటలు పాడుకుంటా ఇంటికొచ్చేది. మరుసటి రోజు గ్రామంలో చందాలు వేసుకుని యాటలు తెచ్చుకుని మసీదు దగ్గర వాటిని కోసి వంటలు చేసుకుని పీర్లను ఎత్తుకున్న వాళ్ళు ఒక్క పొద్దులు విడిచి తినేవాళ్ళు వీటిని జారతులు అంటారు.