: దేవనకొండలో ఉత్కంఠ పోరు.. రేపే పత్తికొండ కౌంటింగ్ సెంటర్‌లో అసలైన ఫైట్!

దేవనకొండ/పత్తికొండ: దేవనకొండ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ముగిసిన సమరానికి సంబంధించిన తుది ఘట్టం సమీపించింది. రేపు పత్తికొండలోని కౌంటింగ్ సెంటర్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండటంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పతాక స్థాయికి చేరింది. కౌంటింగ్ కోసం ఇప్పటికే ఏజెన్సీ ఏర్పాట్లను ముమ్మరం చేయగా, ఆయా పార్టీల కీలక నేతలు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు సమరానికి సర్వసన్నద్ధమయ్యారు. 'మేమే విజేతలం'.. పార్టీల ధీమా! పోలింగ్ సరళిని లెక్కలు వేసుకున్న ఆయా పార్టీల నాయకులు తటస్థ ఓటర్లు తమవైపే మొగ్గు చూపారని గట్టిగా నమ్ముతున్నారు....