POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 5:05 pm Posted by : POLITICAL POWER

దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ సెప్టెంబర్ 14.2026.దేవరకద్రనియోజకవర్గ ప్రజలకు, అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువతీ యువకులకు, మీడియా మిత్రులందరికీ వినాయక చవితి సందర్భంగా ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆచార సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే ఈ వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా, భక్తిశ్రద్ధలతో,ఆధ్యాత్మికవాతావరణంలో,శాంతియుతంగాజరుపుకోవాలనిమనస్ఫూర్తిగాకోరుకుంటున్నానని, వినాయక చవితిపండుగ సందర్భంగా వినాయక మండపాల వద్ద మనమందరం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైనవిషయాలనుమీతపంచుకుంటున్నాను.కరెంట్ వైర్ల దగ్గర జాగ్రత్త మండపాలవద్దమనయువత, నిర్వాహకులుఎంతోఅప్రమత్తంగాఉండాలి.ముఖ్యంగా విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాల దగ్గర పిల్లలు, యువకులు జాగ్రత్తగా ఉండాలి.ఎలాంటిప్రమాదాలకు తావులేకుండాఅవసరమైనభద్రతాచర్యలుతీసుకోవాలి,అత్యవసర వాహనాలకు దారి ఇవ్వండి  వినాయక మండపాలను రహదారులకు ఒకవైపు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు లేదా ఇతర అత్యవసర వాహనాలు వచ్చినప్పుడు వెళ్లేందుకు ఒక్క పక్కన దారి ఖాళీగా ఉంచాలి, ఒకరి ప్రాణాన్ని కాపాడేందుకు మనం ఇచ్చే దారి ఎంతో విలువైనది,సౌండ్ బాక్సుల శబ్దాన్ని తగ్గించండి,మన పండుగ ఆనందం ఇతరులకు ఇబ్బందిగా మారకూడదు. పెద్దలు, చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బులు, ఇతరతర అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బంది పడకుండా డీజేలు, సౌండ్ బాక్సుల శబ్దాన్ని పరిమితంగా ఉంచాలి. పండుగను అందరంభక్తి,ఆనందంతోజరుపుకుందాం..అధికారులకు సహకరిద్దాం,వినాయక మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్, మున్సిపల్, గ్రామ పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేయాలి. ప్రజల భద్రత కోసం అధికారులు సూచించే నిబంధనలు, జాగ్రత్తలను పాటిస్తూ వారికి పూర్తి సహకారం అందించాలి.

మన నియోజకవర్గ ప్రజలకు నా చిన్న మనవి పండుగలు అంటే కేవలం పాటలు, నృత్యాలు, వేడుకలు మాత్రమే కాదు మనమందరం ఒకటిగా కలిసి ఉండటం, ఒకరికొకరం సహాయం చేసుకోవడం, సంతోషాన్ని పంచుకోవడమే నిజమైన పండుగ.మన పూజలు,వేడుకలుపర్యావరణానికిహానికలిగించకుండా, పక్కవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించినప్పుడే వాటికి మరింత అర్థం ఉంటుంది, భక్తితో పాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తుంచుకుని మన దేవరకద్ర నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనేఒకఆదర్శనియోజకవర్గంగానిలబెడదాంఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరి ఇల్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానాని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.