పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ పాలేరు నియోజవర్గం ప్రతినిధి యన్ రమేష్ బాబు ఒకపక్క ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలకు రాకుండా అడ్డుకొని, ఆరు గ్యారెంటీ లపై సభలో నిలదీస్తారని భయంతో అసెంబ్లీ గేటు ముందే.. ఎమ్మెల్యేలను ఘోరంగా అవమానించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మీడియా ఛానల్లో పెద్ద చర్చ జరుగుతున్న తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ గేటు ముందు జరిగిన సంఘటనకు త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎమ్మెల్సీ తాతా మధు గారు స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు అని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు మీరనుకున్నంత అమాయకులు కారు. ప్రజలకి అన్నీ తెలుసు. ఎవరిది తప్పు ఎవరు ఈరోజు అతిగా ప్రవర్తించారు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఆల్రెడీ ఎమ్మెల్సీ తాతా మధు ఎక్కడ నేను స్పీకర్ ని అవమానించలేదు అని మీడియా ముఖంగా చెబుతుంటే.. ధర్నాలు ఏమిటో..! ఒకవేళ నేను పొరపాటున మాట్లాడినట్టు స్పీకర్ కి అనిపిస్తే ఆ మాటలని వెనక్కి తీసుకుంటున్నాను అని అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ మహిళ మహిళలకు ఇస్తానన్న 2500, మరియు చదువుకునే యువతకు స్కూటీలను, అడుగుతారేమోనని భయంతో మహిళా ఎమ్మెల్యేలు అని చూడకుండా దుర్యోధన పర్వాన్ని అసెంబ్లీ గేటు ముందు ప్రదర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దొంగే దొంగ అన్నట్టుగా ప్రవర్తిస్తుంటే హాస్యాస్పదంగా ఉంది.