POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 11:15 am Posted by : POLITICAL POWER

*ధరణి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ శైలజ* 

 

మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి

 

మేడిపల్లి: 12 నవంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ

 

మేడిపల్లి డివిజన్ పరిధిలోని ధరణి కాలనీలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై నిన్న జోనల్ కమిషనర్ మరియు,డిప్యూటీ కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.అలాగే ఈ విషయంపై డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ ప్రత్యేక చొరవతో అధికారుల మధ్య సమన్వయంతో,ఈరోజు మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవితో కలిసి సందర్శించిన డిప్యూటీ కమిషనర్ శైలజ కాలనీ అధ్యక్షులు చింతం చంద్రశేఖర్, జనరల్ సెక్రెటరీ బిమిడి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి చంద్ర శేఖర్ మరియు కాలనీ వాసులతో కలిసి ధరణి కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటించి, కాలనీలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా, వారి సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషన్ శైలజ హామీ ఇచ్చారు.

తుంగతుర్తి రవి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ఏఈ సాయి కిరణ్, వర్క్ ఇన్స్పెక్టర్ లింగస్వామి,ధరణి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చింతం చంద్ర శేఖర్, జనరల్ సెక్రెటరీ బిమిడి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి చంద్ర శేఖర్ మరియు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.