ధాన్యం కొనుగోలుకు రైతు ఐడీ తప్పనిసరి

  బిక్కవోలు: రంగాపురం, ఇల్లపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. వాణి రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో వరి పంటకు పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉందని, రైతులు తమ పంటలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. వరి పంటకు సంబంధించి పంటల బీమా గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినందున రైతులందరూ తప్పనిసరిగా పంటల బీమా...