POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 8:32 am Posted by : POLITICAL POWER

నంది హిల్స్ గణపయ్యకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక పూజలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: నంది హిల్స్‌లోని పార్కులో ఏర్పాటు చేసిన మండపంలోని వినాయక విగ్రహానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపయ్యకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. నంది హిల్స్ కాలనీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తనకు ఇల్లు ఉన్న ఈ కాలనీతో పాటు వనపర్తి పట్టణం సమగ్ర అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజల అవసరాలు, కాలనీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వనపర్తిని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా నంది హిల్స్ కాలనీవాసులు ఎమ్మెల్యే మేఘారెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ క్రాంతి గౌడ్, కౌన్సిలర్ కదిరే నాగమ్మ, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కదిరే రాములు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ, వనపర్తి మండల అధ్యక్షులు రవి కిరణ్, రఘుపతిరావు, కాలనీ వాసులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.