నంది హిల్స్ గణపయ్యకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక పూజలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: నంది హిల్స్‌లోని పార్కులో ఏర్పాటు చేసిన మండపంలోని వినాయక విగ్రహానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపయ్యకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. నంది హిల్స్...