నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు
ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని ప్రసిద్ధ నాగపట్నం ప్రార్థన మందిరానికి ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులు మద్దిశెట్టి సామేలు నిన్న రాత్రి చేరుకున్నారు.ఈరోజు ఉదయం ప్రార్థన మందిరంలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలందరూ తమ కుటుంబాలతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషాలు వెల్లివిరియాలని, సమాజంలో శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.