-డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 15 2026: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం పోలీసు పరేడ్ ప్రాంగణంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరు కాగా పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపతరావు , ప్రజా ప్రతినిధులు,జిల్లా అధికారులు, ప్రజలు, స్కూల్ పిల్లలు హాజరయ్యారు. ముందుగా చిన్నారెడ్డి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ గేయాలాపన అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… స్వాతంత్ర్య సమరయోధులకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, జిల్లాలోని ప్రముఖులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా జిల్లా ప్రజలకు, నాయకులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అల్లూరి సీతారామరాజు,సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయులతో పాటు ఎందరో సమరయోధుల పోరాట ఫలితంగా నేడు మనం ఈ స్వాతంత్ర్య ఫలితాలను అనుభవిస్తున్నాము అని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగనిరతిని శాశ్వతంగా గుర్తుంచుకోవాలి అని అన్నారు. నవభారతాన్ని నిర్మించేందుకు, దేశాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు బాధ్యత మనందరిపై ఉంది అని, తెలంగాణ ఏ ఆకాంక్షతో అయితే ఏర్పడిందో, ఆ దిశగా మనందరం కలిసి అడుగులు వేయాలి అని అన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలి అని అన్నారు. జనుల సంక్షేమానికి పటిష్టమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల సహకారంతో అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా ప్రభుత్వం కంకణం కట్టుకుంది అని అన్నారు. ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం, భూ భారతి, రైతు భరోసా ,రైతు బీమా, రేషన్ కార్డులు, సన్న బియ్యం, మరియు ప్రభుత్వ శాఖలు జిల్లా వ్యాప్తంగా చేస్తున్న ప్రగతిని వివరించారు. భారతదేశాన్ని మరింత బలమైన, సురక్షితమైన మరియు అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలని కోరారు. జిల్లా కేంద్రంలో గల వివిధ పాఠశాల విద్యార్థులు జాతీయ గీతాలపై చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వనపర్తి మండల్ NSUI అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, సీనియర్ నాయకులు ఎంట్ల రవి,సురేష్, రామ్ సింగ్ నాయక్, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.