
– సాగునీరు లేక సరళ సాగర్ వెలవెల.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన,
– మదనాపురం మండల పరిదిలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సరళ సాగర్ జలాశయంలో నీటి నిలువలు సరిపడలేక ఆయకట్టు రైతులలో ఆందోళన నెలకొంది,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 24.2026.వనపర్తి జిల్లా మదనాపురం మండల పరిదిలోని ప్రపంచప్రఖ్యాతి గాంచిన సరళ సాగర్ జలాశయంలో నీటినిలువలు సరిపడలేకఆయకట్టురైతులలోఆందోళననెలకొంది. మదనాపురం, కొత్తకోట మండలంలో కలిపి 10 గ్రామాల్లో ఆయకట్టు కింద కుడికాలువకు కొన్నూర్, నరసింగాపురం, నెలివిడి గ్రామాలు ఉన్నాయి. ఎడమ కాలువకిందశంకరమ్మపేట,దాంతనూర్,మదనాపురం, తీర్మాలయాపల్లి, రామన్ పాడ్, అజ్జకొల్లు, వడ్డెవాట, చర్లపల్లి, గ్రామాలకు చెందిన దాదాపుగా 3500 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే జలాశయం పూర్తిసామర్థ్యం22అడుగులు గాను శుక్రవారం నాటికి 7 ఫీట్లు మాత్రమే మీరు ఉన్నాయి.ఆశించినస్థాయిలో వర్షాలులేకరామన్పాడుజలాశయంనుంచిముందస్తుగానీరుతరలించకపోవడంవల్లతగినన్నినీళ్లజలాశయంలో లేకపోవడం వల్ల ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయలేదు. నీళ్లు విడుదల చేయలేకపోవడం వల్ల దాదాపుగా 10 గ్రామాల శివారులో మొత్తం 3500 ఎకరాలుబీడుభూములుఎడారినితలపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న మోటార్లు మొత్తం ఐదు మోటర్లు ఉన్నాయని,వాటిలో నాలుగు మోటర్ల వాడుకలో ఉన్నవాటిలోమూడుమోటార్లద్వారానీటినిపంపించేస్తున్నారు. మొత్తానికి నాలుగు మోటార్లు మొత్తం పెడితే పైపులైను పాతదిగా ఉండటం వల్ల పైపులైను దెబ్బతింటుందనే ఉద్దేశంతో మూడు మోటార్ల ద్వారా రోజుకు80క్యూసెక్కులనీటినిచాలాసార్లుతరలిస్తున్నారు.దీనిద్వారాజలాశయంలో నీటి మట్టం పెరగడం లేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. అందుకే మిగతా మోటార్లను రిపేర్ చేసి మొత్తం నాలుగు మోటర్లు ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తే కొంతవరకు ఫలితం ఉంటుంది. అందుకే ఎమ్మెల్యే జిఎంఆర్ చొరవ చూపి సరళాసాగర్ పైపులైను మోటార్ రిపేరులకు దాదాపుగా కోటి 94 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అయితే ఈ రూపాయలు ఇంకా టెండర్ కాకపోవడం వల్ల పనులు మొదలు కాలేదు. ఎమ్మెల్యే అధికారులు చొరవ చూపి త్వరగా టెండర్లు పిలిచి పనులు మొదలు పెడితే వచ్చే యాసంగి సీజన్లో అన్నదాతలకు తొందరగా నీళ్లు అందించవచ్చు రైతులు ఆశిస్తున్నారు