

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 30 2026: వనపర్తి జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ (NPL) క్రీడా పోటీలను అక్టోబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను ముఖ్య అతిథిగా హాజరైన మహబూబ్‌నగర్ జోన్ ఏజీఎం వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి విద్యా సంవత్సరంలోనూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అదేవిధంగా పాఠశాల బ్రాంచ్ ప్రిన్సిపాల్ బయేందర్ మాట్లాడుతూ… విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు నిర్వహించడం వల్ల శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. జట్టుగా కలిసి పనిచేయడం, సమిష్టి కృషితో లక్ష్యాన్ని చేరుకోవడం, గెలుపోటములను సమానంగా స్వీకరించడం వంటి విలువలు క్రీడల ద్వారా అలవడతాయని వివరించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా విద్యార్థులను తీర్చిదిద్దడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మూడు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.