POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 9:09 am Posted by : POLITICAL POWER

నిజం ఎప్పుడూ జైలు నుంచే బయటకు వస్తుంది, తీర్పు మాత్రం ఎప్పుడూ కూలర్ లోనే ఉంటుంది

మసి బూట్ల హీరో తిరిగి వచ్చాడు!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

సీన్ ఓపెన్ చేస్తే – జైలు గేటు. బయట మీడియా. లోపల నుంచి నడిచొస్తున్నాడు ఒక మనిషి. కాళ్లకు మసి బూట్లు టకటకా. ముఖంలో “నేను తప్పు చేయలేదు” అనే గీత. ఆయనే మన జస్టిస్ CS కర్ణన్.

ఆయన బయోడేటా చూస్తే సినిమా కథే.

మద్రాస్ హైకోర్టుకు వెళ్లిన మొదటి దళిత జడ్జి.

సొంత కోర్టు చేతే జైలుకు పంపబడిన మొదటి సిట్టింగ్ జడ్జి.

ఒకే మనిషి రెండు చరిత్రలు రాశాడు. ఒకటి గర్వించదగ్గది, రెండోది న్యాయవ్యవస్థే గర్వపడేలా చేసింది.

అసలు కథ ఏంటే – 2017.

మన కర్ణన్ గారు కూర్చుని ఒక లేఖ రాశారు. ఎవరికి? దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి.

విషయం ఏంటి? “సార్, మన దగ్గర 20 మంది జడ్జీలు అవినీతిపరులు ఉన్నారు” అని.

చరిత్రలో ఇంతవరకు ఏ సిట్టింగ్ జడ్జి తన సొంత జడ్జిల మీద ఇలా బహిరంగంగా వేలు చూపలేదు. కర్ణన్ చూపించాడు. దమ్ముందా లేదా?

దానికి కేంద్రం ఏమంది? “ఆ లేఖను మేము బయటపెట్టము” అని ఫైల్ మూసేసింది. సైలెంట్.

ఇక సుప్రీంకోర్టు సీన్ లోకి వచ్చింది. “నువ్వు మమ్మల్ని అవమానించావు, కోర్టు ధిక్కారం చేశావు” అని కేసు పెట్టింది.

దానికి కౌంటర్ గా మన కర్ణన్ ఏం చేశాడో తెలుసా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో సహా 7 మంది జడ్జిలకు 5 ఏళ్లు జైలు శిక్ష వేశాడు! తన కోర్టులో తానే తీర్పు రాసేసుకున్నాడు.

నువ్వు నాకు శిక్ష వేస్తావా? నేను నీకు వేస్తాను అన్నట్లు. పూర్తి సినిమా క్లైమాక్స్.

చివరికి, సహజంగానే, పెద్ద కోర్టు గెలిచింది. తీర్పు వచ్చింది

“క్షమాపణ చెప్పు, లేదా 6 నెలలు కూలర్ జైల్లో కూర్చో.”

మనోడు మసి బూట్ల మనిషి. క్షమాపణ అనే పదం ఆయన డిక్షనరీలో లేదు. “నేను చేయను” అని నేరుగా 6 నెలలు లోపలికి వెళ్లిపోయాడు.

ఆ 6 నెలల్లో బయట ఏం ప్రచారం జరిగింది? “ఆయనకు మతి స్థిమితం లేదు” అని. న్యాయం గురించి గట్టిగా మాట్లాడే ప్రతి ఒక్కడికి ఈ దేశంలో తగిలే మొదటి ముద్ర అదే కదా!

కట్ చేస్తే – ఇప్పుడు 2025.

ఢిల్లీలో ఒక జడ్జి గారి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగితే, ఆ మంటల్లో కాలకుండా మిగిలింది – కట్టల కొద్దీ నోట్ల కట్టలు. కోట్ల రూపాయలు.

టీవీలో ఆ నోట్ల కట్టలు చూసిన ప్రతి సామాన్యుడు అనుకున్న మాట ఒక్కటే –

“అరే, ఆ రోజు ఆ మసి బూట్లాయన ఏదో నిజమే చెప్పాడేమో!”

నిజం ఎప్పుడూ జైలు నుంచే బయటకు వస్తుంది, తీర్పు మాత్రం ఎప్పుడూ కూలర్ లోనే ఉంటుంది.