
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 02 2026: పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా సేవలు అందించి నేడు పదవీ విరమణ పొందిన నేనావత్ కబీర్దాసు పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కబీర్దాసు ని, వారి సతీమణిని శాలువాతో ఘనంగా సత్కరించి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికీ పదవీ విరమణ అనేది సహజమే అన్నారు. ఉద్యోగ జీవితంలో ప్రజల మన్ననలు పొందడం, నిజాయితీగా విధులు నిర్వహించడం, పదవీ విరమణ అనంతరం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని, సామాజిక బాధ్యతను ప్రజల సంక్షేమం కోసం వినియోగించాలని సూచించారు. ఉద్యోగ విరమణతో సేవలు ముగిసిపోవని, కొత్త జీవితానికి అది ఒక ప్రారంభమని, మిగిలిన శేష జీవితాన్ని ప్రజాసేవకు, సమాజాభివృద్ధికి అంకితం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు నాయకులు, కార్యకర్తలు ఉద్యోగస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.