నిలువ నీడ కరువు.. తుఫాన్‌ నీటిలో బుచ్చమ్మ బతుకు దుర్భరం!

వర్షపు నీటిలో మునిగిన పూరిల్లు.. విద్యుత్‌ లేదు, వంట చేసుకునే పరిస్థితి లేదు పొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 4: ఒకవైపు కుండపోత వర్షాలు.. మరోవైపు ఉండటానికి సరైన ఇల్లు లేదు. కనీస వసతులు కూడా కరువై ఓ నిరుపేద ఒంటరి మహిళ జీవితం దుర్భరంగా మారింది. దమ్మపేట మండలం జగ్గారం గ్రామపంచాయతీ పరిధిలోని తాటిమల్లపుగుంపులో నివసిస్తున్న బుచ్చమ్మకు తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు కష్టాలను మరింత పెంచాయి. ఆమె నివసిస్తున్న పూరిల్లు పూర్తిగా వర్షపు నీటిలో మునిగిపోవడంతో ఇంట్లోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు...