నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు
ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ–2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి అన్నారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వరుసగా పేపర్ లీక్...